ఏమైనా...
‘‘నాది గాఢమైన ప్రేమ అని చెప్పడానికి నీకోసమేమైనా చేస్తా రాణి!’’
‘‘థాంక్యూ రాజు! ఈప్రేమలేఖని మీ ఫ్రెండ్ రమేష్‌కి ఇచ్చిరా’’!

అదృష్టం
‘‘నీ భార్యకు ఆ కొత్త నర్సింగ్‌హోమ్‌లో ఆపరేషన్ చేయిస్తున్నావటగా! ఆ డాక్టర్ గారికి ఇదే మొదటి కేసట!’’
‘‘తెలుసు! సక్సెస్ అయితే ఆయన అదృష్టవంతుడవుతాడు. కాకుంటే ఆ అదృష్టం నాదవుతుంది.’’

సాధ్యం..
టీచర్‌: ఏరా రాఘవా! అసాధ్యంను సాధ్యం చేస్తావా?
రాఘవ: చేస్తాను టీచర్‌!
టీచర్‌: ఎలా?
రాఘవ: ఏముంది టీచర్‌! చాలా సింపుల్‌.. 'అ' కొట్టేస్తే సాధ్యం అవుతుంది.
టీచర్‌: ఆ(....!

మరొకటి..!
మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల గురించి చెప్పాక..
టీచర్‌: ఏరా చింటూ! మూడవ ప్రపంచయుద్ధం జరిగితే ఏమవుతుంది?
చింటు: మా సోషల్‌ పాఠ్య పుస్తకంలో అదనంగా మరో పాఠం చేరుతుంది టీచర్‌!
టీచర్‌: ఆ(.....!

తాళం...!
రాఘవ: మాధవా! మన నగల షాపు తాళం వెయ్యకుండా వచ్చాను.
మాధవ: ఒక్క నిమిషంరా! ఇప్పుడే వస్తాను.
రాఘవ: ఎక్కడకు వెళ్లావురా?
మాధవ: మన నగల షాపుకు తాళం వెయ్యలేదు అన్నావుగా.. షాపు వైపు వెళ్లే వారందరికీ తాళం వేయమని చెప్పాను.
రాఘవ: ఆ(....

చెప్పినవాళ్లే..!
టీచర్‌: 'నారు పోసిన
వాడే నీరు పోస్తాడు' అన్నట్లు మరో సొంత వాక్యం చెప్పరా గోపీ!
గోపి : 'పాఠం చెప్పినవాళ్లే పరీక్ష రాస్తారు..!' టీచర్‌..
టీచర్‌: ఆఁ...!

తిప్పగలను..!
టీచర్‌: రెండు ఏళ్లు ఎంతరా గోపి?
గోపి : 14 
టీచర్‌..!
టీచర్‌: వెరీగుడ్‌.. మరి ఏడు రెళ్లు ఎంత?
గోపి : నేనూ తిప్పగలను.. 41..!
టీచర్‌: ఆఁ...! 

ఆలస్యంగా నడుస్తోంది...
అమ్మ: ఒరేరు చింటూ! రోజూ ఆరుగంటలకి రైలుబండి ఆట ఆడేవాళ్లు కదరా! ఇవ్వాళ ఏంటీ ఇంతవరకూ ఆటకు వెళ్లలేదు?
చింటు: అదా అమ్మా! ఇవ్వాళ రైలు గంట ఆలస్యంగా నడుస్తుందమ్మా!
అమ్మ : ఆ(.......!

అలాగే ఉన్నాయి..
టీచర్‌: పావనీ! అంకెలు చెప్పమ్మా వరసగా..
పావని: 3, 6, 9, 12...
టీచర్‌: అదేంటమ్మా అలా చెపుతున్నా? ఎవరు నేర్పించారు నీకు అంకెలు..?
పావని: మా గడియారంలో అలాగే ఉన్నాయి మరి. నన్నేం చేయమంటారు టీచర్‌?
టీచర్‌: ఆ(.............

ఆమ్లెట్‌....
టీచర్‌: ఒరేరు నరేందర్‌! పుస్తకం ఎందుకు తేలేదురా?
నరేందర్‌: ఇంట్లో గుడ్లు పెడుతుంది టీచర్‌!
టీచర్‌: ఓహో...! అయితే రేపు ఆమ్లెట్‌ తెస్తావన్న మాట...
నరేందర్‌ : ఆ(..............!

టూ వీలర్ పార్కింగ్
అప్పారావు హడావిడిగా తన ఆటో చక్రం విప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 
సుబ్బారావు: ఏమిటి...సార్ ఆటో చక్రం విప్పుతున్నారు?
అప్పారావు: కాస్త అటు తిరిగి బోర్డు చూడు.
సుబ్బారావు: దానికి, దీనికీ సంబంధం ఏంటి?
అప్పారావు: ఇక్కడ టూవీలర్ మాత్రమే పార్క్ చేయాలట.! అందుకే ఓ చక్రం తీసేస్తున్నాను.
ఫేస్ బుక్ వచ్చిన తర్వాత
రామ్:- అదేంట్రా?? ఇంతకుముందు టీవీ సీరియల్స్ అంటే కోపంతో అంత ఎత్తు లేచేవాడివి? ఇప్పుడేంటి, టీవీ సీరియల్స్ చాల బెటర్ అంటున్నావ్?
శ్యాం:- ఏమిలేదురా... ఇంతకు ముందు సీరియల్ మధ్యలో వ్యాపార ప్రకటనలు వస్తున్న గ్యాప్ లో మా ఆవిడ నా గురించి పట్టించుకునేది.... పేస్ బుక్ వచ్చిన తర్వాత తన పోస్ట్స్ కి వచ్చే కామెంట్స్, లైకులు చూసుకుంటూ ఆ గ్యాప్ కూడా ఇవ్వట్లేదురా..

ఎక్సైడ్
కారు బ్యాటరీ మార్చడానికి వెళ్లాడు సుబ్బి.
మెకానిక్: సార్, ఎక్సైడ్ వెయ్యనా?
సుబ్బి: వద్దొద్దు. ఎక్సైడ్(ఏక్‌సైడ్) వేస్తే మళ్లీ సమస్య వస్తుంది. రెండు వైపులా వెయ్యి.

వా... వా....
కాలిన పెదాలు చూసుకుని దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు మిస్టర్ బాబి.
బాబు: ఏంట్రా బాబీ పెదాలు ఎలా కాలాయి?
బాబి: మా ఆవిడ ఊరెళ్తుంటే రైలు ఎక్కించడానికి స్టేషన్‌కి వెళ్లాను.
బాబు: అయితే...
బాబి: ఆమెని రెలైక్కించిన ఆనందంలో... రైలింజన్‌ని ముద్దు పెట్టుకున్నాను.

గట్టిగా కొట్టనా
రోడ్డు మీద నిలబడి ఒక వ్యక్తి తన చెవిలో తాళాలు పెట్టుకుని తిప్పుకుంటున్నాడు.
అతడ్నే గమనిస్తున్న వెంగళప్ప దగ్గరగా వెళ్లి... 'సార్, ఎంతసేపు ట్రై చేసినా మీరు స్టార్ట్ కావట్లేదా... గట్టిగా నేను కిక్ కొట్టనా' అని అడిగాడు.

పరీక్ష హాల్లో...
లావణ్య: చింటూ ఈ ప్రశ్నకి స్టార్టింగ్ పాయింట్ చెప్పు మిగతా ఆన్సరంతా నేను రాస్తాను.
చింటు: (తల పైకెత్తి, కిందకు వంచి, అటుఇటు చూసి. నెమ్మదిగా) అది 'ది'తో స్టార్ట్ అవుతుంది.

పట్టుచీరతో పదివేలు
రమేష్: అదేంటోరా... డబ్బు క్షణాల్లో మాయమైపోతోంది. నిన్న మా ఆవిడ కంట్లో నలుసు పడిం దని డాక్టర్ దగ ్గరికెళ్తే రెండు వందలు వదిలాయి.
సురేష్: సంతోషించు నిన్న మా ఆవిడ కంట్లో పట్టుచీర పడింది. పది వేలొదిలాయి. నేనెవర్తో చెప్పుకోను?

బావి మీద మూత
సుబ్బారావు: నేను, మా ఆవిడా గొడవ పడితే మా ఇంటి పెరట్లో ఉన్న బావిని చెక్కతో మూసి ఉంచుతాను.
అప్పారావు: ఎందుకు... మీ ఆవిడ నీ మీద కోపంతో నూతిలో దూకుతుందని భయమా?
సుబ్బారావు: కాదు. నన్ను తోసేస్తుందని.

పొదుపరి భర్త
భార్య: చీర కొనుక్కుంటాను... వెయ్యి రూపాయలిమ్మంటే ఇవ్వరేం. పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా ఖర్చు పెడతానని కోతలు కోశారు మరి.
భర్త: ఓసి పిచ్చిదానా...నీకింకా అర్థం కాలేదా.. నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతాను.

ఐరన్ 'టానిక్'
భర్త: ఏమోయ్...కాంతం...నాకెందుకో భయంగా ఉంది.
భార్య: ఏమైందండి..ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా.
భర్త: మరి నెలరోజుల నుంచి ఐరన్ 'టానిక్' వాడుతున్నాను కదా. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని.